08-02-2025 11:49:15 AM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటి జోరు ప్రదర్శిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఎనిమిదో రౌండ్ల తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 430 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కాల్ కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిశీ 2800 ఓట్ల వెనుకంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి ఆధిక్యంలో ఉన్నారు. షాకూర్ బస్తీలో 8,749 ఓట్ల వెనుకంజలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్, గాంధీనగర్ లో బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై ఆప్ అభ్యర్థి నవీన్ చౌధరి 192 ఓట్ల ఆధిక్యం ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లలో బద్లీ స్థానం నుంచి ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ తర్వాత ఒక్కచోట కూడా అధిక్యంలో కనిపించలేదు. జంగ్ పురలో 3,869 ఓట్ల ఆధిక్యంలో మునీశ్ సిసోదియా ముందంజ,