calender_icon.png 23 December, 2024 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ-లాహోర్ కుట్ర

23-12-2024 12:00:00 AM

1912, డిసెంబర్ 23: 1912లో బ్రిటీష్ భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించే సం దర్భంలో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ హార్డింగేను నాటు బాంబు విసిరి హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని ఢిల్లీ కుట్ర కేసు అంటారు. దీన్ని ఢిల్లీ-లాహోర్ కుట్ర కేసు అని కూడా అంటారు. బెంగాల్, పంజాబ్‌లో ఉన్న విప్లవకారులు, రాష్ బిహారీ బోస్ నేతృత్వంలో ఈ కుట్రను పన్నారు. 1912 డిసెంబర్ 23న ఢిల్లీలోని చాందినీ చౌక్ శివారు గుండా వైస్రాయ్ వస్తున్న ఏనుగు అంబారీపైకి నాటు బాంబును విసరడంతో ఈ కుట్ర పరాకాష్టకు చేరింది.