calender_icon.png 23 February, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19 లేదా 20న ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం..

14-02-2025 11:43:28 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంలో కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో ఉండే అవకాశముంది. అమెరికా, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వచ్చే సోమ, మంగళవారాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకీ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవనున్నారు. సమావేశం అనంతరం కొత్త సీఎం ఎవరనేది ఒక కొలిక్కి రానుంది. అయితే సీఎం పదవి ఈసారి మహిళలకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచిన 48 మంది అభ్యర్థుల్లో 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో తొమ్మిది మందితో సీఎం, మంత్రులు, స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు.