20-02-2025 10:15:02 AM
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులైన రేఖా గుప్తా(Delhi CM Rekha Gupta Oath Ceremony) గురువారం మధ్యాహ్నం రాంలీలా మైదానంలో దిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ నేతలందరినీ బీజేపీ ఆహ్వానించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఏకైక మహిళా బీజేపీ నాయకురాలు రేఖా గుప్తా.
ఢిల్లీ క్యాబినెట్ మంత్రులు(Delhi Cabinet Ministers) ప్రకటించారు. జాతీయ రాజధానికి బుధవారం రేఖ గుప్తాను ముఖ్యమంత్రిగా బిజెపి ప్రకటించగా, ఢిల్లీలోని ఆరుగురు క్యాబినెట్ మంత్రులను వెల్లడిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేయడంతో గురువారం ఢిల్లీ క్యాబినెట్ మంత్రులపై ఉత్కంఠకు తెరపడింది. ఢిల్లీ కేబినెట్‌లో పర్వేష్ వర్మ (న్యూఢిల్లీ), మంజీందర్ సింగ్ సిర్సా (రాజౌరీ గార్డెన్), రవీంద్ర కుమార్ ఇంద్రజ్ (బవానా), కపిల్ మిశ్రా (కరవాల్ నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పంకజ్ కుమార్ సింగ్ (వికాస్పురి) మంత్రులుగా నియమితులయ్యారు.
రేఖా గుప్తా ఎవరు? షాలిమార్ బాగ్ నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయిన బిజెపి నాయకురాలు రేఖా గుప్తా, ప్రస్తుతం బిజెపి పాలిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి ఏకైక మహిళా సిఎం, ఢిల్లీకి నాల్గవ మహిళా సిఎం(Fourth woman CM of Delhi). గుప్తా ఏబీవీపీ (Akhil Bharatiya Vidyarthi Parishad) సభ్యురాలిగా దాదాపు ఒక దశాబ్దం గడిపిన తర్వాత 2002లో బీజేపీలో చేరారు. ఆమె ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. అనుభవజ్ఞులైన కౌన్సిలర్, రేఖా గుప్తా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బందన కుమారిపై షాలిమార్ బాగ్ నుండి పోటీ చేసి 29,595 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థిని ఓడించారు.
రేఖ గుప్తాను ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించాలని భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయంపై ఆమె భర్త మనీష్ గుప్తా(Rekha Gupta Husband Manish Gupta) సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో మనీష్ గుప్తా మాట్లాడుతూ, “ఆమె (రేఖా గుప్తా) ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తోంది... పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.