calender_icon.png 25 December, 2024 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు

13-09-2024 02:22:19 PM

న్యూఢిల్లీ, (విజయక్రాంతి): ఢిల్లీ మద్యం కుంభంకోణం కేసులో ఆరోపణలు ఎద్దుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో గతంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిందని, అరెస్టు చట్టబద్ధత కాదా అనే విషయంలో జోక్యం చేసుకోబోమన్న ధర్మసనం తెలిపింది. న్యాయప్రక్రియలో సుదీర్ఘ కారాగారం అంటే స్వేచ్ఛను హరించడమే అవుతుందన్న సుప్రీంకోర్టు లిక్కర్‌ కేసుపై పబ్లిక్‌గా మాట్లాడకూడదని, సీఎం కార్యాలయానికి వెళ్లొదని కేజ్రీవాల్ కు షరతులు విధించింది. అలాగే తీహార్ జైల్ నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్ కు అధికారిక దస్త్రాలపై సంతకాలు చేయవద్దని, రూ. 10 లక్షల పూచీకత్తు, ఇద్దరి ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. సాక్ష్యాలను ట్యాంపర్ చేయకూడదని సూచించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు.