calender_icon.png 22 April, 2025 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మికుంట మార్కెట్ ను సందర్శించిన ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్స్

22-04-2025 06:37:14 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ను మంగళవారం ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ(Delhi Central University)కి చెందిన రిసర్చ్ స్కాలర్స్ హర్షిత, రంజని లు సందర్శించారు. రాష్ట్రంలోని ఉన్న మార్కెట్లను సందర్శనలో భాగంగా జమ్మికుంట మార్కెట్ ను కూడా సందర్శించారు. వారిని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం ఆహ్వానించారు. పత్తి మార్కెట్ యార్డులు పరిశీలించి రోజువారి జరిగే క్రయ, విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాటన్ ఉత్పత్తి ఎలా జరుగుతుందని మద్దతు ధర రైతులకు ఏ విధంగా చెల్లిస్తున్నారని, జిన్నింగ్ మిల్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, మార్కెట్ కార్యదర్శి ఆర్ మల్లేశం, పాలకవర్గ సభ్యులు ఏన్ రాజా, దీక్షిత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.