15-03-2025 09:03:12 AM
ముంబై: నేడు మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్(DC vs MI, WPL 2025 Final) జరగనుంది.ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (2025) ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌తో గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ముంబయి వేదికగా శనివారం రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది ముంబయి ఇండియన్స్ కి రెండవ WPL-2025 ఫైనల్. 2023 మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో డీసీని ఓడించి ఆ జట్టు తొలి ఛాంపియన్‌గా నిలిచింది. శిఖరాగ్ర పోరులో రెండోసారి క్యాపిటల్స్‌తో తలపడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు మళ్లీ విజయం సాధించాలని ఆశిస్తోంది.
రెండో టైటిల్ కొట్టాలని ముంబయి ఇండియన్స్ చూస్తోంది.కాగా, ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఐదు విజయాలు,+0.192 నికర రన్ రేట్‌తో, ముంబయి రెండవ స్థానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్ మూడవ స్థానంలో నిలిచింది. 47 పరుగుల విజయాన్ని సాధించి తొలిసారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ ఎలిమినేటర్‌లో తలపడ్డాయి. ఫైనల్ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ముంబయి మొత్తం 213 పరుగులు చేసింది.ఇది ఇప్పటివరకు WPLలో ఇది అత్యధికం. రన్ చేజింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ 166 పరుగులకు ఆలౌట్ కుప్పకూలిది.