calender_icon.png 23 February, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

16-02-2025 12:42:39 AM

* రాణించిన షెఫాలీ, నికీ ప్రసాద్

* మహిళల ప్రీమియర్ లీగ్ 2025

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. శనివారం వడోదర వేదికగా జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ముంబైపై 2 వికెట్ల తేడాతో ఢిల్లీ  ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. నట్ సివర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (42) ఆకట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌లాండ్ 3 వికెట్లు పడ గొట్టగా.. శిఖా పాండే 2 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి గెలుపొందింది.

ఓపెనర్ షెఫాలీ వర్మ (18 బంతుల్లో 43) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. నికీ ప్రసాద్ (35) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అమెలియా కెర్, హేలీ మాథ్యూస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. శుక్రవారం ప్రారంభమైన డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌పై విజయంతో బెంగళూరు బోణీ కొట్టింది.