calender_icon.png 19 April, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ క్యాపిటల్స్ ‘సూపర్’ విజయం

17-04-2025 12:53:39 AM

  1. టైగా ముగిసిన రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్
  2. సూపర్ ఓవర్ ద్వారా ఫలితం

ఢిల్లీ, ఏప్రిల్ 16: ఐపీఎల్ 18వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్ ద్వారా విజయాన్ని అందుకుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ టై కావడంతో ఢిల్లీ ‘సూపర్ ఓవర్’లో గెలుపును అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

అభిషేక్ పొరెల్ (49), కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (34), స్టబ్స్ (34*) తలా కొన్ని పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో రాజస్థాన్ కూడా 188 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జైస్వాల్ (51), నితీశ్ రానా (51) అర్థసెంచరీలతో రాణించారు.

ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, అక్షర్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. సూపర్ ఓవర్‌లో తొలుత రాజస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ 13 పరుగులు చేసి గెలుపొందింది. నేడు జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.