05-04-2025 07:43:29 PM
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ 18లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(77) అర్థ సెంచరీతో చెలరేగాడు. అభిషెక్ పోరెల్(33), అక్షర పటేల్(21), సమీర్ రిజ్వీ(20) పరుగులతో అదరగొట్టారు.
184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 158 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లో విజయ్ శంకర్(69), రవీంద్ర జడేజా(2), రచిన్ రవీంద్ర(3), డేవాన్ కాన్వే(13), రుతురాజ్ గైక్వాడ్(5), శివమ్ దూబె(18) పరుగులు చేశారు. ఎంఎస్ ధోని 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.