08-03-2025 11:50:18 PM
మహిళలకు వుమెన్స్ డే కానుక..
మహిళా సమృద్ధి పథకానికి ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన మహిళా సమృద్ధి పథకానికి సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేఖ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాం. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా సమృద్ధి యోజన కింద మా సోదరీమణులకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.
పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.5,100కోట్లు కేటాయించేందకు ఢిల్లీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేఖా గుప్తా అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించనుంది. అలాగే ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, నియమనిబంధనలు త్వరలోనే ఖరారు కానున్నాయి. వార్షిక ఆదాయం రూ.3లక్షల కంటే తక్కువ ఉండి, ఇతర పథకాల ద్వారా లబ్ధి పొందని 18 మధ్య వయసు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.