733 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఢిల్లీలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఎలక్షన్ కమిషన్ 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిం ది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు.
35 వేల మ ంది పోలీసులు, 220 కంపెనీలకు చెందిన జవాన్లు, 19 వేల మంది హోంగార్డులు బందోబస్తు చేపట్టనున్నారు. ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీ ప్రత్యే క శ్రద్ధ తీసుకున్నది. క్యూలైన్లలో ఎప్పటికప్పుడు రద్దీని గమనించేందుకు ‘క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అనే సాం కేతికతను వినియోగిస్తుంది. 8న ఫలితాలు వెలువడనున్నాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్..
సాయంత్రం 6:30 గంటల ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, ఐపీఎస్వోఎస్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తాయని సమాచారం. ఆప్, బీజేపీల్లో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయోనని దేశమొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.