25 May, 2026 | 1:43 AM

ఢిల్లీ ఆల్‌రౌండ్ షో

25-05-2026 12:57 AM

ఓటమితో ముగించిన కోల్‌కతా

కోల్‌కతా, మే 24 : ఐపీఎల్ 19వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రాజస్థాన్ విజయంతోనే కోల్‌కతాకు ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెవర్లు రహానే, కేఎల్ రా హుల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 40 పరుగులు జోడించారు. పోరెల్ (22) పరుగులకు ఔటైనా కెఎల్ రాహుల్, సాహి ల్ పరాక్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 రన్స్ జోడించారు.

సాహిల్ 17 బంతుల్లో 24 (3 ఫోర్లు, 1 సిక్సర్) ఔటైన తర్వాత అక్షర్ పటేల్, రా హుల్‌కు జత కలిసాడు. ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ 38 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ 30 బంతుల్లో 60 (5 ఫోర్లు, 4 సిక్సర్లు) వెనుదిరిగాడు. అనంతరం అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28) పరుగులు చేయగా.. చివర్లో అశుతోశ్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, రహానే తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 43 పరుగులు జోడించారు.

అలెన్ (20) ఔటైన తర్వాత రహానే, మనీశ్ పాండే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మనీశ్ పాండే (25) పరుగులకు ఔటవడంతో ఇక్కడ నుంచి కోల్‌కతా బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. ఒకవైపు రహానే క్రీజులో ఉన్నా మరోవైపు మిగిలిన బ్యాటర్లను పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్రీన్ (2) , రింకూ సింగ్ (0) డకౌట్ కొంపముంచాయి. అదే సమయంలో రహానే 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులకు ఔటవగా... కీపర్ విజయ్ దాహియా కూడా ఫెయిలయ్యాడు.

దీంతో పావెల్ ధాటిగా ఆడి నా చివర్లో చేతులెత్తేశాడు. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 , ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు. కేకేఆర్‌పై విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు సాధించి సీజన్‌ను ఆరో స్థానంతో ముగించింది. మరోవై పు కేకేఆర్ 14 మ్యాచ్‌లలో ఆరు విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. అటు రాజ స్థాన్ రాయల్స్ ముంబైని ఓడించడంతో పంజాబ్, కోల్‌కతా లీగ్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టాయి.

స్కోరు బోర్డు 

ఢిల్లీ ఇన్నింగ్స్ : 203/5 ( కేఎల్ రాహుల్ 60, అక్షర్ పటేల్ 39, మిల్లర్ 28 ; సౌరవ్ దూబే 2/28 , అంకుల్ రాయల్ 1/23 )

కోల్‌కతా ఇన్నింగ్స్ : 163 ( రహానే 63, పావెల్ 29 , మనీశ్ పాండే 25 ; ఎంగిడి 3/27 , కుల్దీప్ 3/29 , స్టార్క్ 2/26 )