calender_icon.png 8 January, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. పార్టీల మధ్య త్రిముఖ పోరు

07-01-2025 05:25:35 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దేశ రాజధానిలో ఫిబ్రవరి 5న ఒకే విడుతలో పోలింగ్ నిర్వహించి, 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. 70 మంది శాసనసభ్యుల పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. దేశ రాజధానిలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆప్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఆమ్ ఆదామీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికలలో మొత్తం 70 సీట్లలో 62 సీట్లును ఆప్ గెలుపోందగా, మిగిలిన వాటిని బీజేపీ గెలుపోందింది. ఢిల్లీ మద్యం అవినీతి కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా పలువురు నేతలు అరెస్టవడంతో ఒక్కసారిగా కుదేలైన ఆప్ పార్టీ పలు వాగ్దానాలతో ఢిల్లీ వాసులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

మరోవైపు, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై బిజెపి అవినీతి ఆరోపణలను చేస్తోంది. ఆప్ బేస్‌లోకి ప్రవేశించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 1998 నుంచి ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఇప్పుడు ఆ కరువును దూరం చేయాలని బీజేపీ చూస్తోంది.దేశ రాజధానిలో పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఓటర్లు తిరస్కరించినప్పటికి వచ్చే ఎన్నికల్లో తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అర్హులైన వారికి రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని వాగ్దానం చేస్తూ ప్యారీ దీదీ యోజనను ప్రకటించి మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో మ్యాజిక్ నంబర్ 36. ఢిల్లీలో సవరించిన కొత్త ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం గత రెండు నెలలుగా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 

అక్టోబర్ 2024లో మొత్తం ఓటర్ల సంఖ్య 1,53,57,529. అయితే, సారాంశ సవరణ తర్వాత, ఈ సంఖ్య 1,55,24,858కి పెరిగింది, డిసెంబర్ 2024 నాటికి 1,67,329 కొత్త ఓటర్లు చేరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 10న నోటీఫికేషన్ విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. నామినేషన్ల సమర్పణకు జనవరి 17ను చివరి తేదీగా ప్రకటించి, 18న నామినేషన్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 20న నామినేషన్ల ఉపసంహరణ, ఫిబ్రవరి 5న పోలీంగ్, 08న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించింది.  ఢిల్లీలో సవరించిన కొత్త ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. తాజా లెక్కల ప్రకారం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ ఎన్నికలకు 13,033 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ తెలిపారు.