calender_icon.png 17 November, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ వీడియోలు తొలగించండి

17-11-2024 12:37:59 AM

హక్కులకు భంగం కలిగించే వీడియోలపై యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే వీడియోలను తొలగించాలని యూట్యూబ్ నిర్వాహకులను హైకోర్టు ఆదేశించింది. కోకాపేటకు చెందిన మొల్ల శివకుమార్ అలియాస్ శివయ్య ఆయన భార్య, కుమారుడిపై ‘మీమాంస విక్టిమ్స్’ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలను తొలగించాలని ఉత్తర్వులు జారీచేసింది.

తమ వ్యక్తిగత ప్రతిష్ఠ, పరువును దెబ్బతీసేలా కథనాలు ‘మీమాంస యూట్యూబ్’ ఛానల్లో ఉన్నాయని, వాటిని తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఆస్తుల క్రయవిక్రయాల వ్యాపారాలకు సంబంధించి పలువురికి సలహాలు ఇస్తుంటారని అన్నారు.

అదేవిధంగా బాచుపల్లికి చెందిన ఎ మురళీకృష్ణ దంపతులు పిటిషనర్ సలహాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని. వ్యాపారంలో అనుకున్న లాభాలు రాలేదన్న కారణంగా పిటిషనర్లపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉండగా మురళీకృష్ణ దంపతులు ‘మీమాంస విక్టిమ్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి పిటిషనర్ల ఫొటోలతో సహా వారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా వీడియోలు అప్లోడ్ చేశారన్నారు.

వీడియోలను తొలగించాలని యూట్యూబ్ ప్రతినిధులకు లేఖ రాసినా పట్టించుకోలేదని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు.. కేసులు పెండింగ్‌లో ఉండగా వారి వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేలా వీడియోలను పెట్టరాదని సూచించింది.

పిటిషనర్లకు చెందిన వీడియోలను తొలగించాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. పిటిషనర్లపై ఎలాంటి వీడియోలను అప్లోడ్ చేయరాదంటూ మురళీకృష్ణ దంపతులకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ నౌఖల్సా గ్రామంలోని సర్వే నంబర్ 66/2లోని ప్రశాంతి హిల్స్‌లో నాగాహిల్స్ సొసైటీలోని ప్లాట్ కు కలెక్టర్ ఎన్వోసీ జారీచేయడంపై హైకో ర్టు నిలదీసింది. డిక్రీ పొందిన నాగా హిల్స్ దాని అమలుకు ప్రయత్నించాలిగానీ, ప్రై వేటు వ్యక్తికి ఎన్వోసీ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది.

ప్రశాంతి హిల్స్ భూములకు సంబంధించిన వివాదంపై పూర్తి వివరాల తో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేసింది. అప్పటివరకు ప్రశాంతిహిల్స్ భూ ములపై యథాస్థితిని కొనసాగించాలని ఆ దేశిస్తూ విచారణను 28కి వాయిదా వేసిం ది. నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆళ్లగడ్డ చెన్నమ్మ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భా స్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ త రఫు న్యాయవాది వాదనలను వినిపిస్తూ.. పిటిషనర్ 600 చదరపు గజాలను సాదాబైనామా కింద కొనుగోలు చేసి తరువాత క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు. దీ న్ని మొదట ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని, తరువాత నాగా హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ కొనుగోలు చేసిందని చెప్పారు.

ఇక్కడ ప్లాట్లో నిర్మాణాలకు ప్రైవేటు వ్యక్తి మృత్యుంజయరెడ్డికి కలెక్టర్ ఎన్వోసీ జారీచేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూమిపై సొసైటీ డి క్రీ పొందిందని, డిక్రీ అమలుకు సొసైటీ కోర్టును ఆ శ్రయించాల్సి ఉందని, దీనికి భిన్నంగా ఎన్వోసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  భూమిపై యాజమాన్య హక్కుల పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు.

సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేయండి

విజయసాయిరెడ్డి కేసులో ఐసీఏఐ అప్పీల్ పిటిషన్ దాఖలు

హైదరాబాద్, నవంబర్ 16 (విజయ క్రాంతి): వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పా ల్పడిన వ్యవహారంపై విచారణ నిమిత్తం వై సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నో టీసులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై విచారణకు హా జరుకావాలని పేర్కొంటూ 2023 అక్టోబ రు 23న ఇచ్చిన నోటీసులను విజయసాయిరెడ్డి గతంలో హైకోర్టులో సవాల్ చేశా రు. ఆ పిటిషన్‌ను అనుమతిస్తూ సింగిల్ జ డ్జి జులై 30న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఐసీఏఐ అప్పీలు దాఖలు చేసింది.

విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదనే తమ వాదనను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. విజయసాయిరెడ్డి ఆఫీస్, ఐసీఏఐ ఆఫీస్ చెన్నైలో ఉన్నందున చెన్నై హైకోర్టే విచారణ చేసి తీర్పు చెప్పాల్సివుందని వివరించింది. దీనికితోడు విజయసాయిరెడ్డిపై విచారణ ప్రాథమిక దశలోనే ఉన్నందున ఆయనపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది.