calender_icon.png 23 October, 2024 | 3:53 AM

గుడి ధ్వంసం వీడియోలు తొలగించండి

23-10-2024 02:22:25 AM

సెంట్రల్ సైబర్ క్రైం వింగ్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని ముత్యాలమ్మ దేవత విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోలను, దానికి సంబంధించిన లింకులను తొలగించాలని కేంద్ర సైబర్ క్రైం సమన్వయ విభాగం సీఈవోకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

అంతేగాకుండా విగ్రహ ధ్వం సానికి సంబంధించి పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మారేడుపల్లి పోలీసులను ఆదేశించింది. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసానికి సంబంధించిన వీడియోల లింకులను తొలగించక పోవడాన్ని సవాల చేస్తూ న్యాయవాది ఐ రామారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సున్నితమైన అంశాలకు సంబంధించిన సమాచా రంపై వీడియోలు వైరల్ అవుతుండటంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని అన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి సున్నితమైన అంశాలకు చెందిన వీడియోలను తొలగించాలని కేంద్రాన్ని ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాన్ని ధ్వంసంపై పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌ను ఆదే శించారు. విగ్రహ ధ్వంసంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనలో పాల్గొన్నందున పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివే యాలని కోరుతూ ముగ్గురు వ్యక్తులు దాఖ లు చేసిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.