calender_icon.png 18 April, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే సహించం

04-04-2025 12:47:20 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఏప్రిల్ 3: (విజయక్రాంతి):  అభివృద్ధి నిర్మాణం పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను, కాంట్రాక్టర్లను  హెచ్చరించారు. ఈ మేరకు గురువారం అడిక్‌మెట్ డివిజన్లోని మణెమ్మ గల్లీలో డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులను ఆయన పలువురు బిఆర్‌ఎస్ నేతలతో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా కనుగుణంగా డ్రైనేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరిత గతన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించలేని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జై సింహా అడిక్మెట్ డివిజన్ అధ్యక్షుడు బల్ల శ్రీనివాస్ రెడ్డి, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, నాయకులు సురేందర్ శ్యాంసుందర్, చిట్టి, మాధవ్, అబ్బు బాయ్, ధర్మ, యునీస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.