మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేశామని, రాజీవ్ గాంధీ వారసులమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు.. సచివాల యం ముందున్న రాజీవ్ గాంధీ విగ్ర హం సాక్షిగా పంచాయతీ రాజ్ చట్టాలను తుంగలో తొక్కడం దారుణమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం కేటాయిం చిన నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేయకపోవడంతో రాష్ర్టం లో గ్రామాభివృద్ధి నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు.
నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిందని, నిర్వహణ ను గాలికి వదిలి వేయడంతో గ్రామా లు మురికి కూపాలుగా మారాయన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నదన్నారు. మాజీ సర్పంచులు గవర్నర్‌ను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మొర పెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పాలనలో వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.