కమీషన్ల కోసం రైతులను బలి పెడతారా?
ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు
ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు
కరీంనగర్, నవంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలి వ్వకుండా తప్పించుకోవడానికి ధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద బీజేపీ నాయకులతో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను బలిపెడుతున్నారని ధ్వజమెత్తారు. వడ్ల పైసలన్నీ మిత్తితో సహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వడ్లు ఎందుకు కొంటలేరని ప్రశ్నించారు. కాగా ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండని దుయ్యట్టారు. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్‌కు, ఆచరణకు పొంతన లేదన్నారు. కొనుగోళ్లు చేపట్టకపోవడంతో కేంద్రాల్లో వడ్ల రాశులు పేరుక పోయాయయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు వడ్లన్నీ కొనాల్సిందేనని, బోనస్ చెల్లించాల్సిదేనన్నారు. రాష్ట్రం లో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు.
భీమదేవరపల్లి, నవంబరు 10: కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాద ని, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను కేసీఆర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెప్పించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మం డలం రంగయ్యపల్లి గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించారు. కేసీఆ ర్ వివరాలు ఇవ్వకుంటే ఆయన ప్రభుత్వంలో ఖర్చు చేసిన మొత్తం రాబట్టాలని లేదంటే వారి ఆస్తులు జప్తు చేయాలన్నారు. బండి సంజయ్ వెంట బీజేపీ నాయకులు రావుపద్మ, పృధ్వీరాజ్ ఉన్నారు.
గౌడన్నలు సల్లంగుండాలె!
హుస్నాబాద్, నవంబర్ 10: గీతన్నల రాత మార్చేది బీజేపీయేనని, వారు సల్లంగుండాలనేదే తమ అభిమతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో ఏడాది క్రితం తాటిచెట్లు దగ్ధమయ్యాయి. అప్పుడు గీతకా ర్మికులను బండి సంజయ్ పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సొంత ఖర్చులతో బోరు వేయిస్తానని మాట ఇచ్చారు. ఆ మేరకు బోరుబావి తవ్వించి మోటారు ఫిట్ చేయించి ఆదివారం ప్రారంభించారు. తాటివనంలో గీతకార్మికులు తెచ్చిన కల్లు తాగారు. అనంతరం వారితో కలిసి లంచ్ చేశారు.