calender_icon.png 21 February, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ బిల్లుల జాప్యం.. టీచర్ల అవస్థలు

16-02-2025 12:39:39 AM

* ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మెడికల్ రీయిం బర్స్‌మెంట్, ఇతర పెండింగ్ బిల్లులు విడుదలకాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు.  గత రెండు మూడేళ్లుగా ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను సక్రమంగా విడుదల చేయడం లేదన్నారు.

గత ప్రభు త్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల సమస్యలను పట్టిం చుకోవడంలేదని మండిపడ్డారు. శనివారం తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్స్ ఇన్‌స్టిట్యూట్ ఎంప్లాయీస్ అసోసి యేషన్, టీయూటీఎఫ్ తనకు మద్దతు ప్రకటించినట్లు కొమురయ్య ప్రకటన విడుదల చేశారు.