calender_icon.png 10 March, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఫ్లు ఓవర్ పనుల్లో జాప్యం

10-03-2025 12:54:24 AM

అంబర్‌పేట ఫ్లు ఓవర్ పనుల్లో 10 శాతం పెండింగ్

భూసేకరణ చేయనందువల్లే పనులు ఆలస్యం

ఎక్స్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): అంబర్‌పేట ఫ్లు ఓవర్ నిర్మాణ పనుల్లో జాప్యానికి రాష్ట ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను ఆలస్యం చేయడం వల్లే ఇంకా 10% పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో దాదాపు 90% పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫ్లు ఓవర్ నిర్మాణం వల్ల శ్మశానవాటికకు ఎలాం టి ఇబ్బంది లేకుండా చూసేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నట్టు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేస్తే అంతే త్వరగా పనులు పూర్తి చేసి, ఫ్లు ఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పా రు. అలాగే తెలంగాణలో నాలుగు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్థిక వ్యవస్థను మోదీ సర్కారు మరింత శక్తివంతం చేస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.

తశనివారం దివిటిపల్లి వద్ద కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భూమి పూజ చేసిన అమరరాజా గిగా ఫ్యాక్టరీ అల్ట్‌మిన్ ప్రైవే ట్ లిమిటెడ్, సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవకాశం లభిస్తుందన్నారు.