calender_icon.png 29 December, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి సెల్ ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

22-07-2024 04:00:42 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన మ్యాకల రుచిత (18) మెదక్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తాను మెదక్  హాస్టల్ లో ఉంటూ చదువుకుంటానని తనకు మొబైల్ ఫోన్ కొనివ్వమని తన తండ్రి (స్వామి)ని కోరింది. స్వామి కొద్ది రోజుల తరువాత కొనిస్తాని చెప్పి పొలం పనులకు వెళ్ళాడు. దీంతో మనస్థాపానికి గురైన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై బాలరాజ్  తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.