రాజేంద్రనగర్, నవంబర్14: డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్రీజ నగరంలోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువు తోంది. ఇటీవల ఆమె బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ లో ఉన్న తన అక్క ఇంటికి వచ్చి గురువారం ఇంట్లో ఓ గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.