హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో అన్ని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో మంగళవారం వెల్లడించింది. నేటి నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు నిరవధికంగా బంద్ కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నిసార్లు ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని మొరపెట్టుకున్న ప్రభుత్వం స్పంధించకపోవాడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి చర్యలు జరపడంతో తమ డిమాండ్ ను నేరవేరుస్తామని హామీ ఇవ్వడంతో పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. చర్చలు సఫలమయ్యాయని, నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే డిగ్రీ 3,5 సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి వెల్లడించారు.