calender_icon.png 1 March, 2025 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన డిగ్రీ కళాశాల విద్యార్థులు

01-03-2025 06:48:38 PM

పటాన్ చెరు: జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయి పోటీలకు పటాన్ చెరు డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో విద్యార్థులు సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు చెప్పారు. కళాశాల నుంచి 12 రీసెర్చ్ స్టడీ ప్రాజెక్ట్లు సమర్పించగా 11 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని తెలిపారు. ఈనెల 4, 5, 6 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో కళాశాల నుంచి 60 మంది విద్యార్థులు పోటీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఎమ్డీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ శనివారం కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనేందుకు అవసరమైన రూ.32వేల విలువైన బ్లేజర్లను విద్యార్థులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జరగబోయే పోటీలలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.