08-04-2025 08:05:50 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట గ్రామ శివారులో గల శ్రీరామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఈనెల 24న నిర్వహించనున్నట్లు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు దేశాయిపేట ప్రశాంత్, సుధాకర్ రెడ్డి, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.