calender_icon.png 18 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలంకారప్రాయంగా డిగ్రీ కళాశాల

03-07-2024 12:05:00 AM

  • ప్రారంభానికి నోచుకోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల 
  • విద్యార్థులకు తప్పని ఇక్కట్లు 
  • అందుబాటులోకి తీసుకురావాలని విన్నపాలు 

ఇబ్రహీంపట్నం, జూలై 2: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని వినోభనగర్‌లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలంకారప్రాయంగా మారింది. నిర్మాణం పూర్తయినప్పటికీ విద్యార్థులకు అందుబాటులోకి రాలేదు. దీంతో విద్యార్థులు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడ అధిక ఫీజులను భరించలేక విద్యార్థులు బెంబేలెత్తి పోతున్నారు. రూ.2.25 కోట్ల అంచనా వ్యయంతో 2016 డిసెంబర్‌లో మాజీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా డిగ్రీ కళాశాల భవనానికి శంకుస్థాపన చేయగా, నేటికీ అందుబాటులోకి రాకపోవడంపై విద్యార్థు లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి వస్తుందా? లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.

జూనియర్ కాలేజీలో డిగ్రీ తరగతులు 

ఇంటర్, డిగ్రీకి సంబంధించి దాదాపు 1,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే స్థానికంగా ఉన్న జూనియర్ కళాశాలలోనే అందరికీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు బోధన జరుగుతోంది. దీంతో సరై న విద్య అందడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

చాలీచాలని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారని, ల్యాబ్, లైబ్రరీ నిర్వహణ కు గదులు కూడా లేవని విద్యార్థులు వాపోతున్నారు. కొత్త కోర్సులు కూడా ప్రవేశపె ట్టడంతో తరగతుల నిర్వహణ మరీ ఇబ్బందిగా మారిందంటున్నారు. శానిటేషన్ సమ స్యతో పాటు కనీసం తాగునీరు లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నూతనంగా నిర్మిం చిన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

నేటికి తీరని కళాశాల సమస్య   

గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించి 8 ఏళ్లు గడుస్తున్నా కళాశాల నేటికీ అందుబాటులోకి రాకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు మారిన  విద్యార్థుల గోస పట్టడం లేదు. కొన్నేండ్లు పోరాటాలు చేస్తే ఇబ్రహీంపట్నానికి డిగ్రీ కళాశాల మంజూ రైంది. కానీ విద్యార్థులకు కళాశాలను అం దుబాటులో తీసుకురావడంలో, విద్యను అందించడంలో గత ప్రభుత్వం విఫలమైం ది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా కొత్త భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి.

 మచ్చ మహేందర్, బీఎస్పీ

 ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు