calender_icon.png 19 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్

19-11-2024 12:39:24 AM

ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): నేటి నుంచి కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు స్టేట్ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం తో కళాశాలలు నడపలేని పరిస్థితి తలెత్తిందని యూనియన్ నేతలు సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించమని స్పష్టం చేశారు.

ఆర్టీఎఫ్ బకాయి లు వచ్చాకే కళాశాలలు తెరిచేలా అన్ని యూనివర్సిటీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లోనూ మూడు రోజులు బంద్ పాటించామని, గతంలో ఇచ్చిన టోకెన్ల ఫీజు బకాయిలు వారం రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చి దాన్ని ఇంత వరకూ అమలు చేయలేదన్నారు.