16-04-2025 01:06:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): 2025-26 విద్యాసంవత్సరాని కి గాను మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గు రుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కో సం సొసైటీ కార్యద్శి బడుగు సైదులు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మార్చి లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన విద్యార్థులు బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ, బీఎఫ్‌టీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం (ఈనెల 16) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే విద్యార్థు లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురుకులాల్లో అమ్మాయిలకు 4,880, అబ్బాయిలకు 4380 కలిపి మొత్తం 9260 సీట్లున్నాయని తెలిపారు.