మంథని(విజయక్రాంతి): మంథని ఎస్ఐ గా సోమవారం డేగ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... మండలంలో మత్తు పదార్థాల అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, మత్తు పదార్థాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మధ్యవర్తిత్వం లేకుండానే నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని, వారికి విచారణ జరిపి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలిపారు. మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసులకు సహకరించాలని ఎస్స్ఐ కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐని సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.