11-12-2024 02:14:05 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఏవియేషన్ భారీ ప్రాజెక్టులు , నావల్ భారీ ఒప్పందాల కోసం పనిచేస్తున్నట్టు ఎక్స్‌సెల్ ఎంఏఏఆర్‌ఎస్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ లిమిటెడ్ ఇన్ కార్పొరేటెట్ కోర్ డివిజన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద కార్గో నౌకలు, ప్రయాణికుల విమానాలు, యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకల కోసం పరికరాల దిగుమతులు, ఎగుమతులను నిర్వహిస్తుందని వెల్లడించారు.
సంస్థ ప్రభావవంతమైన విధానంలో ప్రభుత్వ అనుమతి పొందిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) ఒప్పందాల ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తుందని వారు పేర్కొన్నారు. ఏదైనా బిలియన్ డాలర్ల ఆర్డర్‌ను నిర్వర్తించగల సామర్థ్యంతో భారీ ప్రాజెక్టులకు సరిపోయే విధంగా సంస్థ సన్నద్ధమవుతుందని తెలిపారు. ఈ సంస్థ ఏఈఏపీ గ్రూప్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందినట్టు వారు చెప్పారు.