calender_icon.png 17 March, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిఫెన్స్ మద్యం పట్టివేత

16-03-2025 10:27:53 PM

18 బాటిళ్ళు స్వాధీనం, ఒకరి అరెస్టు...

మేడ్చల్ (విజయక్రాంతి): మల్కాజిగిరి యాప్రాల్ ప్రాంతంలో బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఒక వ్యక్తి డిఫెన్స్ మద్యం అమ్ముతుండగా ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన అంకోజు శ్రీనివాస్ వద్ద నుంచి 18 డిఫెన్స్ మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎస్హెచ్ఓ మేడ్చల్ మల్కాజిగిరి స్టేషన్లో అప్పగించినట్టు టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నిందితుడికి చెందిన సెల్ ఫోను, ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్న తెలిపారు.