calender_icon.png 7 April, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఓకే

06-04-2025 12:21:52 AM

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర రక్షణ శాఖ

ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలోనే పౌర విమానాశ్రయం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాసిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్

ప్రధాని మోదీ, రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసు ల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలోనే పౌరవి మానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆదిలాబాద్ విమా నాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, నాయకుల నుంచి కొంతకాలంగా వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఏడాది ప్రారంభంలో లేఖ రాశారు.

వ్యక్తిగతంగానూ కలిసి ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజావసరాలకు సద్విని యోగం చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై రక్షణ శాఖ అధికారులతో చర్చించిన తర్వాత సానుకూల నిర్ణయా న్ని తెలియజేస్తూ.. శుక్రవారం రాజ్‌నాథ్‌సింగ్ కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ రావడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

 ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం దశాబ్దాలు గా డిమాండ్ ఉందని.. అయితే గత ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గత పాలకులు ఏమాత్రం సహకరించలేదని ఆరోపించారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలు ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని 2021, అక్టోబర్ 6న అప్ప టి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా అప్పటి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని.. కానీ దానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పం దనే రాలేదన్నారు.

మామూనూరు భూసేకరణ త్వరగా చేయాలి

ఇటీవలే వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతులు లభించడంతో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన భూసే కరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తిచేసి ఇస్తే.. ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసేందుకు వీలవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ త్వరగా పూర్తయితే వీలైనంత త్వరగా వరంగల్ ప్రజల స్వప్నం సాకారమవుతుందన్నారు. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్- ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఆర్సీఎస్ -ఉడాన్) పథకంలో భాగంగా దాదాపు 620 రూట్లలో ఇప్పటికే హైదరాబాద్‌కు 60 రూట్స్ (10%) ఆపరేషన్‌లో ఉన్నాయని, వరంగల్, ఆదిలాబాద్‌లో కూడా విమానాశ్రయాల సేవలు ప్రారంభిస్తే తెలంగాణకు ఉడాన్ కింద మరికొన్ని రూట్స్ అందుబాటులోకి వస్తాయన్నారు.