23-03-2025 12:43:55 AM
ఈనెల 25లోపు అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కార్యాలయంలో బీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, పా డి కౌశిక్‌రెడ్డి తరుపు న్యాయవాదులు నోటీసులు అందశేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును కేపీ వివేకానందగౌడ్, కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించిన అంశం విచారణకు రానున్నది. 25వ తేదీలోగా స్పీకర్ కార్యాలయం అఫిడవిట్ దాఖ లు చేయాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.