calender_icon.png 13 November, 2024 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువును ఓడించి ఒలింపిక్స్‌కు

11-08-2024 02:59:21 AM

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన రవికుమార్ దహియాను గురువుగా భావిస్తానని అమన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ ఆ గురువునే ఓడించి పారిస్‌లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించి ఉండడు. అమన్ ఉన్న 57 కేజీల విభాగంలోనే రవి కుమార్ కూడా పోటీలో ఉన్నాడు. జాతీయ ట్రయల్స్‌లో తన గురువును ఓడించిన అమన్ ఆత్మవిశ్వాసాన్ని సాధించాడు. అనంతరం రవి దహియాను కలిసి సూచనలు, సలహాలు పొందాడు.

గురువుపై వచ్చిన విజయం స్పూర్తితో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి చిట్టచివరి అవకాశమైన ప్రపంచ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో అంతర్జాతీయ రెజ్లర్లను మట్టికరిపించి తొలిసారి ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. 21 ఏళ్లకే ఒలింపిక్స్‌లో కాంస్యం తెచ్చిన అమన్ ఇదే తరహా ఆటతీరును ప్రదర్శిస్తే అతడి నుంచి మరిన్ని అద్భుతాలు చూసే అవకాశముంది.