calender_icon.png 15 January, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిఖత్ జరీన్ ఓటమి

02-08-2024 12:06:22 AM

పారిస్: ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ 0 తేడాతో చైనా బాక్సర్ వు హూ చేతిలో పరాజయం చవిచూసింది. తొలి బౌట్ నుంచి ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వడంలో విఫలమైన నిఖత్ నిరాశతో ఇంటి ముఖం పట్టింది.  ఈసారి విశ్వక్రీడల్లో కచ్చితంగా దేశానికి పతకం తెస్తుందనుకున్న నిజామాబాద్ చిన్నది ప్రిక్వార్టర్స్‌కే పరిమితమై నిరాశపరిచింది.

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన నిఖత్ జరీన్ ఈసారి ఒలింపిక్స్‌కు మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మేరీ కోమ్ తర్వాత రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో నిఖత్ జరీన్‌పై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ప్రిక్వార్టర్స్ ఓటమితో నిఖత్ బాధాతప్త హృదయంతో రింగ్‌ను వీడింది. మ్యాచ్ ఓటమి అనంతరం నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం అయింది. ‘నన్ను క్షమించండి.. ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. వు యూ నాకు కఠిన ప్రత్య ర్థి. అభిమానులు నాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. రిక్త హస్తాలతో తిరిగి రావడాన్ని తట్టుకోలేకపోతున్నా’ అని పేర్కొంది.