- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మనాలలో వాలీబాల్ టోర్నమెంట్
సిరిసిల్ల, జనవరి 8 (విజయ క్రాంతి): క్రీడల్లో ఓటమి గెలుపుకు నాంది కావాలని, పోలీస్ శాఖకు యువతకు సత్సంబంధాలు మెరుగుపర్చలనే ఉద్దేశ్యంతో మండల స్థాయి వాలిబాల్ పోటీలలు దోహద పడతా యని, మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా, జాతీయ స్ధాయిలో రాణించాలని వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్న మెంటును ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్రా సమస్యలు దూరంగా ఉంటుందనే అనే ము ద్ర నుండి సామాజిక రుగ్మతలు రూపుమ ముతూ ఏదైనా సమస్యలు తలెత్తుతే మేము ఉన్నాం అంటూ శాంతి భద్రతలను సమర్ధ వంతగా నిర్వహిస్తున్నారని అన్నారు.
ప్రజల కు, యువతకు పోలీస్ సేవలు మెరుగుపర చాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో విన్నూత కార్యక్ర మాలు చేపడుతూ ప్రజలకు భరోసా కల్పి స్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీ స్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలి పారు. గ్రామీణ ప్రాంతాలలో డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని లైసెన్స్ లు అందజే యలనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ ఆధ్వ ర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించి గతంలో 100 మంది యువతి యువకులకు లైసెన్స్ అందజేయడం జరిగిందన్నారు.
రెండవ దశ లో సుమారు 700 వరకు లైసెన్స్ లు అంది చేలా ప్రణాళిక రూపొందించడం అభినం దనియమన్నారు. యువత సన్మార్గంలో నడి చేందుకు గంజాయి రహిత రాష్ర్టంగా తయా రు చేసేందుకు ముఖ్యమంత్రి రూపొందిం చిన ప్రణాళికలను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తూ, జిల్లా లో పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను సన్మార్గంలో నడిపించ డానికి జిల్లా కేంద్రంలో డి ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతా యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని, ఏఆటలోనైనా గెలు పు, ఓటమి అనేది సహజం కాని చివరి వర కు పోరాడాలన్నారు. యువత చెడు వ్యసనా లకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు, క్రీడలపై దృష్టి సారించాల న్నారు.
అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉన్న మానాల గ్రామాన్ని తరచు సందర్శించడం జరుగుతుందని, ఇటీ వల కాలంలో మానాల చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని,అంతే కాక యువతకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయాలని, యువత చెడు వ్యసనాల వైపు పోకుండా యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ, స్పోర్ట్స్ మీట్ వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.
యువత గంజాయి వంటి మాధకద్రవ్యాల దూరంగా ఉండాల న్నారు. గ్రామంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి వాలిబాల్ పోటీలలో 13 జట్లు పా ల్గొన్నాయని, గెలుపొందిన జట్లకు బహమ తులు అంద చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ రాష్ర్ట సహకార యూని యన్ చైర్మన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు అశోక్, అంజయ్య పాల్గొన్నారు.