తొలి వన్డేలో ఆసీస్ గెలుపు
బ్రిస్బేన్: స్వదేశంలో న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గి జోష్‌తో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత అమ్మాయిలకు ఊహించని షాక్ తగిలింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హర్మన్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటిం గ్ చేసిన భారత్ 34.2 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌ ట్ అయింది. రోడ్రిగ్స్ (23), హర్లీన్ డియోల్ (19) మినహా మిగతావారు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మేఘ న్ స్కట్ 5 వికెట్లతో చెలరేగగా.. కిమ్ గార్త్, గార్డనర్, అనాబెల్‌ల, అలానా కింగ్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 16.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జార్జియా వోల్ (46 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చగా.. ఫోబే లిచ్‌ఫీల్డ్ (35) రాణించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వ రుసగా క్యూ కట్టినప్పటికీ ఛేదన తక్కువగా ఉండడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3 వికెట్లు పడగొట్టింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.