calender_icon.png 24 October, 2024 | 3:59 AM

కొండా సురేఖపై పరువు నష్టం కేసు విచారణ 30కి వాయిదా

24-10-2024 01:56:16 AM

నాగార్జున కేసులో కోర్టు తీర్పు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ సెషన్ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 10న నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. దీనిపై కొండా సురేఖ తరఫున అడ్వకేట్ గుర్మీత్ సింగ్ రిప్లు ఫైల్ చేశారు.

ఈ నెల 30న కౌంటర్ ఫైల్ చేస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం వకాలత్ దాఖలు చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. కాగా, అక్కినేని కుటుంబంతో పాటు నాగ చైతన్య, సమంత విడాకులపై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ నెల 8న మొదట నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్న న్యాయస్థానం, పరువు నష్టం దావాకు సంబంధించిన వివరాలపై ఆరాతీసింది. కొం డా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగార్జున తన స్టేట్‌మెంట్ ద్వారా కోర్టును కోరారు.

ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 10న మరోసారి విచారణ జరిపి సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు వాంగ్మూ లం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ న్యా యస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది.