calender_icon.png 22 November, 2024 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కొండాపై పరువు నష్టం కేసు వాయిదా

22-11-2024 01:32:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో గురువారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు.

ఆ తర్వాత ఎక్స్‌లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారని, ఆ పోస్ట్‌ను చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అశోక్‌రెడ్డి వాదించారు. మంత్రి కొండా సురేఖ తరఫున గురుప్రీత్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. మంత్రి ఉద్ధేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు.

కేటీఆర్ వల్ల కొందరు ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారనే కోణంలో సమంతను ఉదహరిం చారని వివరించారు. పిటిషనర్ వెరొకరి అభిప్రాయాలతో పిటిషన్ వేశారని తెలిపారు. అలాంటప్పుడు పిటిషన్‌కు అర్హత లేదని, కొట్టేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.