calender_icon.png 2 October, 2024 | 7:54 PM

దొరను ఎదిరించిన దీరవనిత ఐలమ్మ!

04-09-2024 12:00:00 AM

(సెప్టెంబర్ 10న ఐలమ్మ వర్ధంతి సందర్భంగా) :

చాకలి ఐలమ్మ.. ఓ చరిత్ర. దున్నేవాడిదే భూమి అని సాగిన తె లంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ఒక నిప్పురవ్వ. ఈ వీరవనిత పేరు లేకుం డా సాయుధ పోరాట చరిత్రే లేదు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపి, చైతన్యాన్ని రగిలించింది. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరూలూదింది. చాకలి ఐలమ్మది వరంగల్ జిల్లా రాయపర్తి మం డలం క్రిష్టాపురం. పాలకుర్తికి చెందిన చి ట్యాల నర్సయ్యను పెళ్లి చేసుకుంది. నలుగురు కొడుకులు, ఓ కూతురు. భూమినే నమ్ముకున్న ఐలమ్మ.

పాలకుర్తిలో మల్లంపల్లి భూస్వామి కొండలరావు దగ్గర 40ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది. బహుజన కులానికి చెందిన ఐలమ్మ.. దొరల భూమిని సాగు చేయడం పట్వారీ శేషగిరిరావుకు నచ్చలేదు. దీంతో ఐలమ్మ ను వేధించసాగాడు. కుటుంబంతో వచ్చి తనపొలంలో కూలీ చేయాలని హుకూం జారీ చేశాడు. పాలకుర్తిలో అప్పటికే ఆంధ్రమహాసభ ఏర్పడింది. నిజాం అరాచకాలు, దొరల అణచివేతలపై ఆంధ్ర మహాసభ ప్రశ్నిస్తోంది. ఇందులో సభ్యురాలైన ఐలమ్మ పట్వారీ తాటాకు చప్పళ్లకు బెదరలేదు.

విసినూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి.. అరాచకాలకు పెట్టింది పేరు. అన్యాయా న్ని ప్రశ్నిస్తే అంతం చేసేవాడు. పట్వారీ శేషగిరిరావు ఐలమ్మ విషయాన్ని దేశ్ ము ఖ్ కు చేరవేశాడు. విసినూర్ దేశ్‌ముఖ్ ఆగడాలను ఆంధ్రమహాసభ అడ్డుకుంటూ వస్తోంది. ఐలమ్మ కూడా సభలో సభ్యురాలవడంతో.. కక్ష గట్టాడు. ఐలమ్మ కమ్యూ నిస్టుల్లో చేరిందని దొంగ కేసులు పెట్టించాడు. ఐలమ్మ కొడుకులను అరెస్ట్ చే యించాడు. బెదిరింపులకు లొంగని ఐలమ్మ న్యాయ పోరాటం చేసిన దొరపై గెలిచింది. మొదటిసారి ఐలమ్మ నుంచి దొరకు దెబ్బ తగిలింది. సహించలేని విసినూర్ దొర.. ఐలమ్మ పొలాన్ని తనపేర రా యించుకున్నాడు. అయితే దొరను గానీ, దొర గుండాలను గానీ తన పొలాన్ని టచ్ చేయనివ్వలేదు ఐలమ్మ.

పొలంలోని వడ్ల ను తీసుకునేందుకు వచ్చిన దొరగుండాలను ఆంధ్రమహా సంఘం సభ్యులతో కలి సి తరిమికొట్టింది. ధాన్యాన్ని ఇంటికి చే ర్చింది. ఐలమ్మ చేతిలో రెండోసారి దెబ్బతిన్న విసినూర్ దొర రామచంద్రారెడ్డి ఈసారి మరింత క్రూరమైన పథకంతో వచ్చాడు. ఐలమ్మ చేతిలో ఓటమిని తట్టుకోలేని దేశ్‌ముఖ్.. రజాకార్లతో పాలకుర్తి లో దాడులు చేయించాడు. ఐలమ్మ ఇంటి ని తగలబెట్టించాడు. రజకార్లు ధాన్యం ఎత్తుకెళ్లారు. కూతురిపై లైంగికదాడి చేశారు. అడ్డొచ్చినవారిని చంపేశారు. ఆర్థికంగా దెబ్బతీసినా, కుటుంబాన్ని కూల్చే సినా.. ఐలమ్మ అడుగు ముందకే పడింది. 

పోరాటంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగింది ఐలమ్మ. పట్వారీ శేషగిరిరావు ఇంటిని కూల్చేసింది. అక్కడే మక్కలు పండించింది. ఐలమ్మ తెగువ ఎన్నో ఉద్యమాల కు ఊపిరి పోసింది. ఐలమ్మ భూ పోరా టం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. 90 ఎకరాల దొర భూమిని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగువేలమంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూపంపకం జరిగింది. 1885 సెప్టెంబర్ 10న చనిపోయింది. ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలను సెప్టెంబర్ 10న అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది.