calender_icon.png 25 March, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కుక్కల దాడిలో జింక హతం..

23-03-2025 10:52:38 PM

తాజాగా ఆదివారం మరో జింక బలి..

రెండు నెలల్లో రెండు జింకలు బలి వన్యప్రాణులకు రక్షణ ఏది..?

పరిగి (విజయక్రాంతి): పరిగి ప్రాంతంలో రోజురోజుకు అడవులు అంతరించిపోవడం పర్యవసానంగా వన్యప్రాణులు ఉండుటకు అనువైన స్థలం ఉండకపోవడం వల్లనే తరచూ వన్యప్రాణులు గ్రామాలలోకి దూసుకు వచ్చి తమ ప్రాణాలు కోల్పోతున్న సంబంధిత అధికారులు దృష్టిలో చలనం లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నదని పరిగి కేంద్రంలోని ప్రజలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. అడవుల విషయంలో ఏమైనా ఆలోచన చేయండి కానీ వన్యప్రాణులను ఈ విధంగా కుక్కలు ఖర్చి చంపడం భయానకమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అంటే జిల్లా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రజలు కోరుతున్నారు.

అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులకు రక్షణ కరువైందని మండల ప్రజలు తప్పుపడుతున్నారు. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని చెరువు వద్ద ఆదివారం ఉదయం కుక్కలు జింక వెంబడి పడ్డాయి. చెరువులో నీరు తాగేందుకు వచ్చిన జింకను గమనించిన కుక్కలు వెంబడించి తీవ్రంగా కరిచాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే కుక్కలను బెదిరించి జింకను చేరదీశారు. అప్పటికి తీవ్రగాయాలైన జింకను గ్రామస్తులు గ్రామానికి తీసుకువచ్చి వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు పరిగి ప్రభుత్వ పశు వైద్యశాలకు తీసుకు వస్తుండగా జింక మార్గ మధ్యంలోనే మృతి చెందింది. మృతి చెందిన జింకను తిమ్మాయపల్లి ఫారెస్ట్ లో జెసిబి తో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టారు. పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొద్ది రోజుల క్రితం మరో జింక కూడా మృతి చెందగా గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టారు. ఇలా నెలకు ఓ జింక మృతి చెందుతూ పోతే అడవిలో వన్యప్రాణులు కనుమరుగవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.