ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి చేరుకుంది. ఇటీవలే స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో దీప్తి శర్మ రెండు మ్యాచ్‌లు కలిపి 8 వికెట్లు పడగొట్టింది. వడోదర వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో దీప్తి (6/31) తన కెరీర్‌లో బెస్ట్ ప్రదర్శన నమోదు చేసింది.
ప్రస్తుతం దీప్తి (665 పాయింట్లు) ఐదో స్థానంలో ఉండగా.. ఎసెల్‌స్టోన్ తొలి స్థానంలో ఉంది. బ్యాటింగ్ విభాగంలో మంధాన ఒక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా.. భారత్‌తో వన్డే సిరీస్‌లో సెంచరీలతో కదం తొక్కిన విండీస్ ఓపెనర్ హేలీ మాథ్యూస్ ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచింది.