మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని పొన్నారం భక్తాంజనేయ స్వామి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. అయోధ్యలో దీపోత్సవం అక్టోబర్ 28 నుండి 31 వరకు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా గ్రామంలోని ఆలయంలో దీపోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సంకె గంగ రాజేష్, నల్లెల్లి స్రవంతి వినీత్ దంపతులు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరుకాగా నల్లెల్లి తిరుమల, కొంతం సునీత, పెంచల సుమలత, ఈధ పద్మ, ముప్పిడి రాజేశ్వరి, పెంచాల లక్ష్మి, ముప్పిడి మంగ, పెంచాల రమ్య, తాటికొండ శ్రావణి, కొంత శ్రావణి, సాటపురి తిరుపతి, ఫీల్డ్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య, దొండ సంపత్, ముప్పిడి సంపత్, బోరగుంట లక్ష్మణ్, కాపురపు వినయ్, నీలం రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.