పారిస్: మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ దీపికా కుమారి ప్రిక్వా ర్టర్స్‌లో అడుగుపెట్టింది. టీమ్ విభాగంలో నిరాశపరిచిన దీపికా వ్యక్తిగత విభాగంలో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి పతకంపై ఆశలు రేపుతోంది. తొలి రౌండ్‌లో దీపికా 6 ఎస్తోనియా ఆర్చర్ రీనా పర్నత్‌పై కష్టపడి విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోటీలో రీనా గట్టి పోటీ ఇచ్చింది.
అయితే చివరి సెట్‌లో 10 ,9, 9తో మొత్తంగా 28 పాయింట్లు సాధించి విజయాన్ని అందుకుంది. ఆపై 1/16 రౌండ్‌లో దీపికా 2 నెదర్లాండ్స్‌కు చెందిన క్వింటీ రోఫెన్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరగనున్న 1/8 రౌండ్‌లో దీపికా జర్మనీకి చెందిన మికెల్లె క్రొప్పెన్‌తో తలపడనుంది. ఇప్పటికే భజన్ కౌర్ ప్రిక్వార్టర్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. పురుషుల వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్ రాయ్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అంకిత బాకత్, ధీరజ్ బొమ్మదేవర మాత్రం రెండో రౌండ్‌కు పరిమిత మయ్యారు.