కిడ్నాప్ గురైన వారి మృతదేహాలు లభ్యం
రాష్ట్రంలో అదుపు తప్పిన పరిస్థితులు
ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ సహా ఇంటర్నెట్ సేవలు బంద్
ఇంఫాల్, నవంబర్ 16: మణిపూర్ జిరిబామ్ జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా మరో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్ జరిగిన ౫ రోజు లకు మృతదేహాలు లభిచాయి. శుక్రవారం సాయంత్రం అస్సాం సరిహద్దులో ఉన్న జిరి నదిలో తేలుతూ ఉన్న ౩ మృతదేహాలను తొలుత గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఉదయం మరో ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్టు తెలిపారు. జిరిబామ్ జిల్లా బోకోబెరాలో కుకీ వర్గానికి చెందిన దుండగులు సోమవారం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే అధికారులు 10 మంది కుకీ దుండగులను కాల్చి చంపారు. దాడి అనంతరం ఆ ప్రాంతంలోని మైతీ తెగకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కనిపించకుండాపోయారు.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మైతీ తెగకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆం దోళనలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించారు. నిందితు లను 24 గంటల్లో పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్, విష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్‌పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.