26-03-2025 04:54:34 PM
కుప్పకూలిన ఆరంతస్తుల భవనం..
ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నివాసం ఉంటున్న ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ రెవెన్యూ ఫైర్ పంచాయితీ అధికారులు. పట్టణంలోని పోకల వారి వీధిలో మధ్యాహ్నం ఆరంతస్తుల నిర్మాణ భవనం కుప్పకూలింది. పై నుండి కిందకు ఒక్కసారిగా కుంగిపోవడంతో భవనం కింద పనిచేస్తున్న ఇద్దరు మనుషులు భవనం శిలాల్లో ఉన్నట్లు భవనం యజమానులు తెలిపారు.
వారిని రక్షించడానికి ఫైర్ అధికారులు పంచాయతీ అధికారులు రెవిన్యూ అధికారులు పోలీసు అధికారులు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ఈ భవన నిర్మాణం నాచురకంగా ఉందని గతంలో అనేకమంది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ విధంగా జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. అయితే ఇంటి యజమానురాలు శిధిలాల కింద ఇద్దరే ఉన్నారని చెప్తున్నప్పటికీ ఐదుగురు వరకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.