కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): అవినీతికి పాల్పడుతున్న అట వీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం దీక్షను విమరించారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీచీఫ్ హామీ ఇవ్వడంతో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్ ఎమ్మెల్యే హరీశ్‌బాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశా రు. కాగా ఫారెస్టు అధికారులపై ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సిర్పూర్ డివిజన్ పరిధిలో క్షేత్రస్థాయి లో జరుగుతున్న పరిణామాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.