19-02-2025 12:00:00 AM
కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరోహీరోయిన్స్‌గా ఆక్సాఖాన్, తులసి, అనూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ఆర్‌కే ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ..
‘ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్‌ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చాలా అందమైన లొకేషన్లలో, హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరించాం. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది.
లవ్ యాక్షన్‌తోపాటు మైథలాజికల్‌ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు కిరణ్ నటన హీరో శ్రీహరిని గుర్తుచేసేలా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా కిరణ్‌కు మంచి గుర్తింపు వస్తుంది. ఆక్సాఖాన్ స్పెషల్ సాంగ్‌లో తనదైన శైలి డాన్స్ ఆదరగొట్టింది. సాంకేతిక నిపుణులందరూ ఎంతో దీక్షతో పనిచేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు.