calender_icon.png 29 November, 2024 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీక్షా దివస్ విజయవంతం

29-11-2024 06:43:35 PM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం డిఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష దివాన్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు 2009 నవంబర్ 29వ తేదిన ఆమరణ దీక్షకు దిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఇదే రోజున దీక్షా దివస్ ను పాటిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగూడెం దీక్షా దివస్ విజయవంతం చేసేందుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీ రవిచంద్ర నాయకత్వాన పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ హరిసింగ్ నాయక్,మునిసిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన దిండిగాల రాజేందర్, రామకృష్ణ తదితర ప్రముఖుల సహకారంతో దీక్షాదివస్ సభ విజయవంతమైంది.

సభకు వేల సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు, హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సభలో ఉద్యమకారులు తమ అనుభవాలను వివరించారు, వారిని పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అంతా కలిసి ఆత్మీయ విందు ఆరగించారు. దీక్షాదివస్ సందర్భంగా కొత్తగూడెం పట్టణం గులాబీ రంగు అలుముకుంది, ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలతో అలంకరించారు. "జై తెలంగాణ జైజై తెలంగాణ","జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్", "వర్థిల్లాల్లి వర్థిల్లాల్లి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి", "జోహార్లు జోహార్లు అమరవీరులకు జోహార్లు"అనే నినాదాలతో కొత్తగూడెం హోరెత్తింది. సభ ప్రారంభానికి ముందు ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్యేలు వనమా, రేగా, మెచ్చా, హరిప్రియ తదితర ప్రముఖులు తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేశారు. జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రగతి మైదానం నుంచి సభా ప్రాంగణం తెలంగాణ భవన్ వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ జరిగింది.